Vote Jihad : ‘‘మదర్సా టీచర్ల వేతనాల పెంపు ఓట్ జిహాద్ కాదా ?’’.. బీజేపీని ప్రశ్నించిన రౌత్

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు.

Update: 2024-10-11 17:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. మదర్సా టీచర్ల జీతభత్యాలను పెంచుతూ షిండే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ‘ఓట్ జిహాద్’ కాదా అని ఆయన బీజేపీని ప్రశ్నించారు. ఒకవేళ విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే.. బీజేపీ తప్పకుండా వాటిని ఓట్ జిహాద్‌గా అభివర్ణించి ఉండేదన్నారు. ‘‘వచ్చే నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఇలాంటి టైంలో ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజనను అమల్లోకి తెెచ్చారు. మౌలానా ఆజాద్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్‌ను రూ.700 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెంచారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నారు’’ అని సంజయ్ రౌత్ ఆరోపించారు.


Similar News