‘ఎడిటర్స్ గిల్డ్’ నేరమే కనిపించడం లేదు.. మణిపూర్ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్

మణిపూర్‌ హింసాకాండపై ఈనెల 2న నిజ నిర్ధారణ నివేదికను విడుదల చేసిన ఎడిటర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది.

Update: 2023-09-15 14:25 GMT

న్యూఢిల్లీ : మణిపూర్‌ హింసాకాండపై ఈనెల 2న నిజ నిర్ధారణ నివేదికను విడుదల చేసిన ఎడిటర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎడిటర్స్ గిల్డ్‌ మెంబర్స్‌కు ఊరట లభించింది. జర్నలిస్టుల పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. మణిపూర్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా ఆ ఎడిటర్స్‌పై ప్రాథమికంగా ఎలాంటి అభియోగాలు కనిపించడం లేదన్నారు.

వారిపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌‌ను ఎందుకు రద్దు చేయకూడదని మణిపూర్ సర్కారును ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో మరో రెండు వారాల పాటు ఆ నలుగురు జర్నలిస్టులను అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. జర్నలిస్టులకు వారి అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని స్పష్టం చేశారు. ‘‘ఆ పాత్రికేయులు చేసిన తప్పేమిటో మణిపూర్ ప్రభుత్వం చెప్పాలి. వారు ఒక రిపోర్టును విడుదల చేయడం కూడా నేరంగా ఎలా పరిగణిస్తారు ?’’ అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు.


Similar News