Maharashtra Results: రిజల్ట్ రాకముందే మహారాష్ట్ర సీఎం పోస్టుపై దుమారం.. అధికార కూటమిలో ఫ్లెక్సీ కలకలం

రిజల్ట్ రాకముందే మహారాష్ట్ర సీఎం పోస్టుపై దుమారం రేగింది.

Update: 2024-11-22 06:11 GMT
Maharashtra Results: రిజల్ట్ రాకముందే మహారాష్ట్ర సీఎం పోస్టుపై దుమారం.. అధికార కూటమిలో ఫ్లెక్సీ కలకలం
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Maharashtra Results) రేపు వెలువడనున్నాయి. అధికార మహాయుతి (Mahayuti Alliance), ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (Maha Vikas Aghadi Alliance) మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల పోరు సాగింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఫలితాలు రాకముందే రెండు కూటముల్లో సీఎం అభ్యర్థి (Next CM) పై చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ నాయకుడే సీఎం అవుతారని గురువారం కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే కామెంట్ చేయగా ఈ ప్రతిపాదనను ఉద్ధవ్ థాక్రే శివసేనకు చెందిన సంజయ్ రౌత్ ఖండించారు. కాంగ్రెస్ నాయకుడే తదుపరి సీఎం అవుతారని తాను నమ్మడం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. ఫలితాల తర్వాత చర్చించాకే ఎంవీఏ తన సీఎం ఎవరనేది నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే అధికార కూటమి మహాయుతికి చెందిన ఎన్సీపీ నేతలు మరో అడుగు ముందుకు వేశారు.

ఏకంగా ఫ్లెక్సీలు:

ఎన్సీపీ (NCP) అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీకి చెందిన నేత సంతోష్ నంగారే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పూణేలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కూటమిలో చిచ్చుపెట్టే అంశం కావడంతో ఆ వెంటనే ఈ ఫ్లెక్సీని తొలగించారు.

నెక్స్ట్ సీఎంగా ఆయనకే ప్రజల మద్దతు:

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అనే చర్చ జరుగుతున్న వేళ నిన్న ప్రకటించిన మై యాక్సెస్ ఎగ్జిట్ పోల్ సర్వే (My Access India Survey) ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సర్వే ప్రకారం మహాయుతి కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు అంచనా వేసింది. ఇక నెక్ట్స్ సీఎం ఎవరూ అనే దానికి జనం ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ సిండేకే జై కొట్టినట్లు ఈ సర్వే పేర్కొంది. 31 శాతం మంది ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలుపగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు 12 శాతం, నితిన్ గడ్కరీకి 2శాతం, అజిత్ పవార్ కు 2 శాతం మంది మద్దతు తెలిపారు. ఇక ప్రతిపక్ష కూటమి నుంచి ఉద్ధవ్ థాక్రే కు 18 శాతం శరత్ పవార్ కు 5, నానా పటోలే కు 2 శాతం మంది కోరుకున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. 


Click Here For Twitter Post.. 

Tags:    

Similar News