వాటర్ మెట్రోకు ఊహించని రెస్పాన్స్.. తొలిరోజే భారీ స్పందన!
దేశంలోనే కేరళలో తొలిసారి అందుబాటులోకి తీసుకువచ్చిన వాటర్ మెట్రోకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నట్లు కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ (కెడబ్ల్యుఎంఎల్) అధికారులు
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే కేరళలో తొలిసారి అందుబాటులోకి తీసుకువచ్చిన వాటర్ మెట్రోకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నట్లు కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ (కెడబ్ల్యుఎంఎల్) అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ సేవలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన మొదటి రోజే హైకోర్టు-వైపీన్ మార్గంలో బోట్లలో మొత్తం 6,559 మంది ప్రయాణించినట్లు కేడబ్ల్యుఎంఎల్ అధికారులు వెల్లడించారు.
వాటర్ మెట్రోలో ప్రయాణించేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు పోటెత్తడంతో రద్దీని అదుపుచేసేందుకు కేడబ్ల్యూఎంఎల్ అధికారులు కొచ్చి మెట్రో రైలు లిమిటెడ్ (కేఎంఆర్ఎల్) నుంచి అదనపు సిబ్బందిని టెర్మినల్ ఎంట్రెన్స్ వద్ద ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కాగా, పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఈ వాటర్ మెట్రో సర్వీస్‌ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ ఎఫ్ డబ్ల్యూ సంయుక్తంగా రూ.1,136.83 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.
Read more: