మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం

మద్యం కొనుగోలు చేసేందుకు ఇకపై మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లిక్కర్ ఏటీఎం ద్వారా మద్యం కొనుగోలు చేసుకునే అవకాశం వచ్చింది.

Update: 2023-05-23 09:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం కొనుగోలు చేసేందుకు ఇకపై మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లిక్కర్ ఏటీఎం ద్వారా మద్యం కొనుగోలు చేసుకునే అవకాశం వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం తాజాగా చెన్నై నగరంలో లిక్కర్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు మనీ ఎటీఎం, వాటర్ ఏటీఎం, గోల్డ్ ఏటీఎం గురించి తెలిసినప్పటికీ తాజాగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చెన్నైలోని పలు మాల్స్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద లిక్కర్ ఏటీఎంలను ప్రవేశపెట్టింది. కోయంబేడు సమీపంలోని వీఆర్ మాల్, టెన్ స్క్వేర్ మాల్, రాయపేట ఎక్స్‌ప్రెస్ అవెన్యూ, వేలచ్చేరి ఫీనిక్స్ మాల్‌లో అందుబాటులో ఉంచారు. ఉదయం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఈ తరహా లిక్కర్ ఏటీఎంలను ప్రారంభించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. అయితే మద్యం బాటిళ్ల కోసం మందుబాబులు గంటల తరబడి క్యూలో నిల్చువాల్సి వస్తోంది. ఇ ఇబ్బందులకు చెక్ పెట్టే ఉద్దేశంలో భాగంగా ఫ్రిజ్‌లో నుంచి కోక్, పెప్సీ బాటిళ్లను కొనుగోలు చేసినట్లుగా మద్యం ప్రియులు లిక్కర్ కొనుగోలు చేసేందుకు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఈ మిషన్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వినియోగదారుల స్క్రీన్ పై తమకు నచ్చిన మద్యాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి తగిన విలువ కలిగిన చెల్లింపులు ఆన్ లైన్ లో లేదా నగదు రూపంలో చెయడం ద్వారా మద్యం సీసాలు అందుకునే వీలు ఉంటుంది. ఈ లిక్కర్ ఏటీఎం విషయంలో మద్యం ప్రియుల రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.

Tags:    

Similar News