Jharkhand Elections : అధికార కూటమికే మళ్లీ పట్టం.. : కల్పనా సొరెన్

బీజేపీ తనను ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుందని జార్ఖండ్ సీఎం సతీమణి, కల్పనా సొరెన్ అన్నారు.

Update: 2024-11-11 19:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ తనను ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుందని జార్ఖండ్ సీఎం సతీమణి, కల్పనా సొరెన్ అన్నారు. జార్ఖండ్‌లో తొలి విడత ప్రచార గడువు ముగిసిన అనంతరం ఇన్‌స్టా గ్రామ్‌‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎన్నికల సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తన అనైతిక విధానాలను కొనసాగిస్తుందని మండిపడ్డారు. సమావేశాలు నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని గాండే స్థానం నంచి ఆమె బరిలో ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు గడువు ముగియకముందే జార్ఖండ్‌లో ఎన్నికలు నిర్వహిస్తోందని సీరియస్ అయ్యారు. జార్ఖండ్‌లో అనైతికంగా ఎన్నికలు గెలవాలనుకునే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అధికార కూటమే తిరిగి పవర్‌లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహగట్‌బంధన్ కూటమిలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. హేమంత్ సోరెన్‌ను జైలులో వేశారని.. ఎలక్షన్ ర్యాలీ చేసుకోవడానికి మాకు అనుమతిని నిరాకరించారని గుర్తు చేశారు. కాగా జార్ఖండ్‌లో 43 స్థానాలకు ఈనెల 13న ఎన్నికలు జరగనున్నాయి.  

Tags:    

Similar News