మరోసారి కాల్పుల మోత.. తెల్లవారుజాము 3 నుంచి కొనసాగుతున్న కాల్పులు
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు( Maoists ), పోలీసుల మధ్య కాల్పులు(exchange of fire) జరుగుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు( Maoists ), పోలీసుల మధ్య కాల్పులు(exchange of fire) జరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మవోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గురువారం తెల్లవారుజామున ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ సరిహద్దులోని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దంతేవాడ(Dantewada)లోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది రాత్రి కుంబింగ్ నిర్వహిస్తుండగా.. ఎదురుపడిన మవోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో వారిని నివారించేందుకు భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరుపుతున్నారు. దీంతో మావోయిస్టులు, పోలీసుల మధ్య తెల్లవారుజాము 3 గంటల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఎదురుకాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.