National flag: ఆ 14 ప్రాంతాల్లో తొలిసారి ఎగరనున్న జాతీయ జెండా

రేపు(జనవరి 26న) యావత్ భారతావని గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day 2025) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది.

Update: 2025-01-25 15:08 GMT
National flag: ఆ 14 ప్రాంతాల్లో తొలిసారి ఎగరనున్న జాతీయ జెండా
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: రేపు(జనవరి 26న) యావత్ భారతావని గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day 2025) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అప్పటి నుంచి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది(2025) 76 వ గణతంత్ర దినోత్సవానికి (Republic Day 2025) ముఖ్య అతిథిగా ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రభోవొ సుబియాంతో (Prabowo Subianto) హాజరువుతున్నారు.

అలాగే ఇండోనేషియాకు చెందిన 190 మంది సభ్యుల బ్యాండ్ కంటింజెంట్‌ కూడా భారత త్రివిధ దళాలతో కలిసి కర్యవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననుంది. ఇది ఏడాది హైలెట్‌గా నిలవనుంది. ఇదిలా ఉంటే.. భారత్ గణతంత్ర దినోత్సవం నిర్వహణకు సిద్ధమవుతోన్న వేళ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్‌(Bastar)లోని 14 మారుమూల ప్రాంతాల్లో జెండావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఈ ప్రాంతాల్లో జెండా ఎగురవేయడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు మావోయిస్టుల(Maoists) పై పైచేయి సాధిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News