సుప్రీం కోర్టుకు ‘ది కేరళ స్టోరీ’ మేకర్స్..

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది.

Update: 2023-05-09 15:18 GMT

న్యూఢిల్లీ: ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. దీనిని సవాల్ చేస్తూ సినిమా మేకర్స్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నిషేధాన్ని తొలగించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు. లా అండ్ ఆర్డర్ భయంలో సినిమా ప్రదర్శనను నిలిపివేసిన మల్టీప్లెక్స్‌ల వద్ద భారీ భద్రతను కోరుతున్నారు. ఈ కారణాలతో సినిమాకు ప్రేక్షకుల స్పందన కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ది కేరళ స్టోరీ తొలి ట్రెయిలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. ఈ ట్రెయిలర్‌ను 32 వేల మంది చూశారు.

రాష్ట్రానికి చెందిన మహిళలను ఇస్లాంలోకి మార్చడం ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలోని హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన విద్వేషాన్ని ఈ చిత్రంలో చూపించారని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎ-సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే కేరళ మాజీ ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ సహా పది సన్నివేశాలను తొలగించమని చెప్పింది. ఈ వివాదాస్ప చిత్ర ప్రదర్శనను బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం నిషేధించారు. మొత్తానికి ఈ అంశాలన్నిటిపై సుప్రీం కోర్టు మే 15వ తేదీన విచారించనుంది.

Tags:    

Similar News