ప్రైవేటు సంస్థల్లో కన్నడ ప్రజలకే 100 శాతం రిజర్వేషన్ల పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

ప్రైవేటు సంస్థల్లో 100 శాతం కన్నడ ప్రజలకే రిజర్వేషన్లపై కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Update: 2024-07-17 15:34 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేటు సంస్థల్లో 100 శాతం కన్నడ ప్రజలకే రిజర్వేషన్లపై కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోమవారం జరిగిన మంత్రి వర్గ భేటీలో ప్రయివేట్ సంస్థల్లో గ్రూప్‌ సీ,గ్రూప్‌ డీ పోస్టుల్లో కన్నడ ప్రజలకు100 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లును పారిశ్రామిక వేత్తలు వ్యతిరేకించారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఈ బిల్లును నియంతృత్వం లాంటిదని అభివర్ణించారు. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పునరాలోచనలో పడిని సీఎం సిద్దరామయ్య కర్ణాటకలో స్థానిక కోటా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలతో చర్చించి.. వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే ఈ బిల్లుపై ముందుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించినట్లు కర్ణాటక సీఎమ్‌వో తెలిపింది.

Tags:    

Similar News