గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు 9 సరుకులు ఫ్రీ!

దారిద్ర రేఖకు దిగువున ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందించి వారికి ఆహార భద్రత కోసం లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-04 03:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: దారిద్ర రేఖకు దిగువున ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందించి వారికి ఆహార భద్రత కోసం లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో కేజీకి 1 రూపాయి చొప్పున తీసుకుని రేషన్ ఇచ్చేది. కానీ, కరోన సమయం నుంచి ఫ్రీ రేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో నిరుపేదలకు ప్రభుత్వ ఫ్రీ రేషన్ స్కీమ్ కింద.. 90 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు బియ్యం ఫ్రీగా ఇచ్చే వారు. ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు 9 నిత్యావసర వస్తువులు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో గోధుమలు, పప్పులు, ధాన్యాలు, చక్కెర, ఉప్పు, ఆవనూనె, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు ఉన్నాయి. ఉచితంగా బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

పేద ప్రజలకు ఆరోగ్యం మెరుగుపరిచేందుకు.. వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రజా జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని కేంద్రం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం బయట మార్కెట్‌లో నిత్యవసర సరుకుల ధర పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న రేషన్ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. అర్హులైన వారు దగ్గరలోని ఆహార, పౌర సరఫరా శాఖ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు.

కాగా ఇక్కడ ఉచిత బియ్యం ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావట్లేదు. కొన్ని రిపోర్ట్స్.. ఉచిత బియ్యానికి బదులుగా ఈ 9 సరుకులు ఇస్తారని చెబుతుంటే.. మరికొన్నేమో.. ఉచిత బియ్యంతో పాటుగా ఇస్తారని పేర్కొంటున్నాయి.


Similar News