Lawrence Bishnoi: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ.. పోలీసులను సస్పెండ్ చేసిన హోం శాఖ

లారెన్స్ బిష్ణోయ్ జైల్ ఇంటర్వ్యూ వ్యవహారంలో తాజాగా పంజాబ్ హోం శాఖ చర్యలు తీసుకుంది.

Update: 2024-10-26 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోజ్ (Lawrence Bishnoi) 2022, ఏప్రిల్ 3న ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం అప్పట్లో పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూ వ్యవహారంలో తాజాగా పంజాబ్ హోం శాఖ (Punjab Home Ministry) చర్యలు తీసుకుంది. ఇంటర్వ్యూకు అనుమతించినందుకు గానూ.. ఆనాటి డీఎస్పీ గురుషేర్ సింగ్‌తోపాటు మరో ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఇక దాదాపు ఏడాదిన్నర క్రితం సీఐఏ పోలీస్ స్టేషన్‌లో ఉండగా బిష్ణోయ్ ఈ ఇంటర్వ్యూ (Interview) ఇవ్వగా.. అప్పట్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జైల్లో ఉన్న ఖైదీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు పోలీసులు (Police) ఎలా అనుమతించారంటూ ప్రతిపక్షాల నుంచి సాధారణ ప్రజల వరకు మండిపడ్డారు. 


Similar News