బెయిల్ వచ్చిందనే ఆనందపడేలోపు కేజ్రీవాల్‌కు మరో షాక్ ఇచ్చిన కోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది.

Update: 2024-07-12 10:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన కొన్ని గంటల తర్వాత ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఆయనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన కేసులో జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జులై 25 వరకు పొడిగించింది. ఈడీ కేసులో బెయిల్ లభించిందని ఆనంద పడేలోపు మరోసారి అది కాస్త ఆవిరి అయింది. దీంతో ఆయన తీహార్ జైల్లోనే ఉండనున్నారు.

అంతకుముందు ఈడీ కస్టడీలో ఉండగానే జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అక్రమాల్లో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారులలో ఒకరని సీబీఐ ఆరోపించింది. ఆప్ మాజీ మీడియా ఇన్‌చార్జి విజయ్ నాయర్ వివిధ మద్యం తయారీదారులు, వ్యాపారులతో టచ్‌లో ఉన్నారని, వారికి అనుకూలమైన నిబంధనలను చేర్చారని తెలిపింది. జూన్ 2021 నుండి జనవరి 2022 వరకు హవాలా మార్గం ద్వారా రూ.44.45 కోట్లు గోవాకు బదిలీ చేశారని, వాటిని ఆప్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారని సీబీఐ ఆరోపించింది.


Similar News