దూసుకొస్తున్న గ్రహశకలం..72శాతం భూమిని ఢీ కొట్టే చాన్స్!

అంతరిక్షంలో ప్రమాదకరంగా తిరుగుతున్న గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకొస్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తెలిపింది.

Update: 2024-06-23 13:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్షంలో ప్రమాదకరంగా తిరుగుతున్న గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకొస్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తెలిపింది. ఇది భూమిని ఢీకొట్టే చాన్స్ 72శాతం ఉందని పేర్కొంది. 14 ఏళ్ల తర్వాత అంటే 2038 జూలై12 న భూమిని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దానిని నియంత్రించడానికి నాసా తగినంత సిద్ధంగా ఉండకపోవచ్చని పేర్కొంది. గ్రహశకలం పరిమాణం, దీర్ఘకాలిక పథాన్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి ఈ పరిశోధనలు సరిపోవని అభిప్రాయపడింది. కాబట్టి దానిని సమర్థవంతంగా ఎదుర్కొలేమని తెలిపింది.

కాగా, నాసా ఏప్రిల్‌లో ఐదో ద్వైవార్షిక ప్లానెటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టాబ్లెట్‌టాప్ వ్యాయామాన్ని నిర్వహించింది. ఈ నెల 20న మేరీల్యాండ్‌లోని లారెల్‌ జాన్స్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీలో దీనికి సంబంధించిన ఫలితాలను ఆవిష్కరించారు. ఈ వ్యాయామం ద్వారానే గ్రహ శకలాన్ని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రభుత్వ ఏజెన్సీలు, దాదాపు 100 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. వాషింగ్టన్‌లోని నాసా హెడ్‌క్వార్టర్స్‌లోని ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ ఎమెరిటస్, లిండ్లీ జాన్సన్ ఈ పరిణామంపై స్పందిస్తూ..ఒక పెద్ద గ్రహశకలం ప్రభావం మానవాళికి ఉన్న ఏకైక ప్రకృతి వైపరీత్యం, సంవత్సరాల ముందుగానే దీనిని అంచనా వేయడం వల్ల దానిని నిరోధించడానికి సాంకేతికతతో ప్రయత్నించొచ్చని తెలిపారు. 


Similar News