యుద్దం ముగింపుకు అదొక్కటే మార్గం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉక్రెయిన్ తో యుద్దానికి ముగింపు పలకడానికి తాత్కలిక ప్రభుత్వం ఏర్పడటమే మార్గమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించాడు.

దిశ, వెబ్ డెస్క్: ఉక్రెయిన్ తో యుద్దానికి ముగింపు పలకడానికి తాత్కలిక ప్రభుత్వం (temporary administration) ఏర్పడటమే మార్గమని రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వ్యాఖ్యానించాడు. రష్యా దళాలు, నావికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఉక్రెయిన్ తో యుద్దం ముగింపునకు సూచనలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వోలోదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelenskiy) పరిపాలన కాలం 2024 మేతో ముగిసినా ఇప్పటికీ ఆయన పరిపాలనలోనే కొనసాగుతున్నారు. దీంతో జెలెన్ స్కీ తో అధికారులు చర్చలు జరపడానికి, కీలక ఒప్పందాలు చేసుకోవడానికి ఆయన చట్టబద్దమైన భాగస్వామి కాదని పుతిన్ వ్యాఖ్యానిస్తున్నారు.
అందుకే ఉక్రెయిన్ లో తాత్కలిక ప్రభుత్వం ఏర్పడాలని, యుద్దం ముగింపునకు పరిష్కారం మార్గం కోసం చర్చలు జరిపి, ఒప్పందాలు చేసుకోవచ్చని పుతిని తెలిపారు. అలాగే సూత్రప్రాయంగా ఐక్యారాజ్య సమితి, యూనైటెడ్ స్టేట్స్ మా భాగస్వాముల ఆధ్వర్యంలో తాత్కలిక పరిపాలనను ప్రవేశపెట్టవచ్చని పుతిన్ సలహా ఇచ్చారు. తాత్కాలిక ప్రభుత్వం ద్వారా ఉక్రెయిన్ లో తిరిగి ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చని, తద్వారా యుద్దం ముగించేందుకు శాంతి చర్చలు ప్రారంభించడానికి సాధ్యపడుతుందని అన్నారు. ఇక రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ముందున్న అధ్యక్షుడు బైడెన్ తో పోలిస్తే, కొత్త అధ్యక్షుడు పుతిన్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని, దీని ద్వారా ట్రంప్ శాంతిని కోరుకుంటున్నారని అనిపిస్తోందని అన్నారు. ఇక ఉక్రెయిన్ లో తాత్కలిక పాలనపై పుతిన్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి.. ఉక్రెయిన్ లో పాలన దాని రాజ్యాంగం, దేశ ప్రజలచే నిర్ణయించబడుతుందని తెలిపారు.