Terrarist attack: కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి.. రెండు గ్రెనేడ్లతో అటాక్

జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ జిల్లాలోని సూరన్ కోట్ ఆర్మీ పోస్టుపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడికి పాల్పడ్డారు.

Update: 2024-12-04 11:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammi Kashmir)లో మరో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ (Poonch) జిల్లాలోని సూరన్ కోట్ (Soran kote) ఆర్మీ పోస్టు (Army Post)పై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఆర్మీ పోస్టుపై రెండు గ్రెనేడ్లను విసరగా వాటిలో ఒకటి మాత్రమే పేలిందని మరొకటి ఫెయిల్ అయిందని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన అనంతరం ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పేలకుండా ఉన్న బాంబును నిర్వీర్యం చేశాయి. ఆర్మీ క్యాంపు చుట్టూ ఉన్న గోడ దగ్గర పేలిన గ్రెనేడ్ సేఫ్టీ పిన్‌ను గుర్తించారు. శ్రీనగర్‌లోని హర్వాన్‌లోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటిరోజే ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి జరగడం గమనార్హం. కాగా, ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News