Terrar attacK: కశ్మీర్‌లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం..తిప్పికొట్టిన భద్రతా బలగాలు

జమ్మూ కశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Update: 2024-07-23 12:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కృష్ణ ఘాటి నుంచి కొంతమంది ఉగ్రవాదులు బట్టాల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ఆర్మీకి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే బట్టాల్‌లోకి ప్రవేశించడానికి టెర్రరిస్టులు ప్రయత్నిస్తుండగా వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాలు మధ్య కాల్పులు జరగగా ఓ జవాన్‌కు గాయాలయ్యాయి. అనంతరం గాయపడిన సైనికుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మిలిటరీ వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. కాగా, 24 గంటల్లోనే ఇది రెండో ఉగ్రదాడి కావడం గమనార్హం. అంతకుముందు రాజౌరిలోని ఘోండాలో శౌర్యచక్ర గ్రహీత పర్షోత్తం కుమార్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమవ్వగా ఒక సైనికుడికి గాయాలయ్యాయి. 

Tags:    

Similar News