రామ మందిర ప్రారంభోత్సవానికి వచ్చే భక్తుల కోసం 'టెంట్ సిటీ'

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సరానికి ఇప్పటికే ముహుర్తం ఖరారైంది.

Update: 2023-11-21 12:53 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సరానికి ఇప్పటికే ముహుర్తం ఖరారైంది. 2024, జనవరి 22న జరగబోయే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతి ఏర్పాట్ల కోసం తాత్కాలిక 'టెంట్ సిటీ'ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు.

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా ఈ టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తాయని, మజా గుప్తర్ ఘాట్, బాగ్ బిజేసి , బ్రహ్మకుండ్ ప్రాంతాల్లో తాత్కాలిక టెంట్లు ఉంటాయని వెల్లడించారు. మజా గుప్తర్ ఘాట్‌లో 20 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మందికి, బ్రహ్మకుండ్ వద్ద 30 వేల మందికి, బాగ్ బిజేసి వద్ద మరో 25 వేల మందికి సరిపోయేలా వసతి ఏర్పాట్లు ఉండనున్నాయి.

భక్తుల కోసం కర్‌సేవక్ పురం, మణిరామ్ దాస్ కంటొన్మెంట్ ప్రాంతాల్లో సైతం ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఇక, చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని అందుకనుగుణంగానే టెంట్లు ఉంటాయని, పరుపులు, దుప్పట్లు కూడా అందించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆహారం, వైద్య సదుపాయం ఉంటాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News