World Trade Center: వరల్డ్ ట్రేడ్‌ సెంటర్‌కు దీపావళి శోభ (వీడియో)

అక్టోబర్ 31న దీపావళిని పురస్కరించుకుని వైబ్రంట్ కలర్స్ తో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను అలంకరించారు. ప్రకాశవంతమైన విద్యుద్దీప కాంతులతో ఆ భవనం జిగేల్ మంటూ వెలిగిపోతోంది.

Update: 2024-10-30 02:23 GMT

దిశ, వెబ్ డెస్క్: దీపావళిని (Diwali 2024) పురస్కరించుకుని అమెరికాలోనే అతి ఎత్తైన భవనం అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Center) విద్యుత్ వెలుగులతో సరికొత్తగా కనిపిస్తోంది. అక్టోబర్ 31న దీపావళిని పురస్కరించుకుని వైబ్రంట్ కలర్స్ తో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను అలంకరించారు. ప్రకాశవంతమైన విద్యుద్దీప కాంతులతో ఆ భవనం జిగేల్ మంటూ వెలిగిపోతోంది. ఇప్పుడిది అక్కడి పర్యాటకులను, న్యూయార్క్ వాసులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఐక్యత, వైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది.

పిరమిడ్ (Pyramid) ఆకారంలో ఉండే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్.. ఆరెంజ్, పసుపు, బ్లూ కలర్ లైట్లతో మిరుమిట్లు గొలుపుతోంది. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ (Festival of Lights) గా పిలుచుకునే దీపావళిని పురస్కరించుకుని భవనాన్ని లైట్లతో నింపేశారు. దానిపై అమెరికన్ దీపావళి (American Diwali) అని ఒక లైన్ వచ్చాక.. దీపాలు కనిపిస్తాయి. చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయాన్ని సాధించిన దానికి ప్రతీకగా జరుపుకునే దీపావళిని గౌరవిస్తూ.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఇలా విద్యుద్దీపకాంతులతో అలంకరించడం వారి నిబద్ధతను తెలియజేస్తోంది. ఈ వీడియోనూ మీరూ ఇక్కడ చూడండి.

Tags:    

Similar News