Suvendhu: బీజేపీ అధికారంలోకి రాగానే మమతను జైల్లో పెడతాం.. సువేందు అధికారి

శ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీని జైలుకు పంపుతామని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు.

Update: 2024-12-31 14:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సందేశ్‌ఖాలీలో జరిగిన అఘాయిత్యాలపై విచారణ జరిపి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్, సీఎం మమతా బెనర్జీ(Mamath benarjee) ని జైలుకు పంపుతామని బీజేపీ నేత సువేందు అధికారి (Suvendhu Adhikari) అన్నారు. మంగళవారం ఆయన సందేశ్ ఖాలీ(Sandesh khali) లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జరిగిన దాన్ని మర్చిపోవాలని మమతా బెనర్జీ ప్రజలను కోరారు. కానీ సందేశ్‌ఖాలీ ఘటనలను ప్రజలు మర్చిపోరు. నేను కూడా మర్చిపోలేను. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సందేశ్‌ఖాలీపై విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. మహిళలపై తప్పుడు కేసులు పెట్టినందుకు మిమ్మల్ని కూడా జైలుకు పంపుతాం’ అని తెలిపారు. చట్టం ప్రకారం వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంటామని, రాజ్యాంగ పరిమితులకు లోబడే నడుచుకుంటామని చెప్పారు.

షేక్ షాజహాన్ వంటి స్థానిక టీఎంసీ వ్యక్తులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ప్రజలను శిక్షించడానికి 2024 ఎన్నికలకు ముందు ఆ ప్రాంతంలోని మహిళలపై తప్పుడు కేసులు పెట్టడానికి మమతా బెనర్జీ కుట్ర పన్నారని ఆరోపించారు. సీఎంకు చెందిన గూండాలు, రాష్ట్ర పోలీసులు ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని ఫైర్ అయ్యారు. కాగా, రాష్ట్రంలోని పశ్చిమ బెంగాల్ లో మహిళలపై అఘాయిత్యాలకు సంబందించిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలసిందే. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా బీజేపీ ఆందోళన చేపట్టింది. అయితే ఈ అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ తాజాగా ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఈ నేపథ్యంలోనే సువేందు అధికారి స్పందించారు.

Tags:    

Similar News