Pune: పూణేలో దారుణం.. భార్యపై అనుమానంతో కుమారుడి హత్య

పూణేలోని చందన్ నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే నెపంతో మూడేళ్ల కుమారుడి గొంతు కేసి చంపిన ఘటన బయటపడింది.

Update: 2025-03-22 13:24 GMT
Pune: పూణేలో దారుణం.. భార్యపై అనుమానంతో కుమారుడి హత్య
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: పూణేలోని చందన్ నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే నెపంతో మూడేళ్ల కుమారుడి గొంతు కేసి చంపిన ఘటన బయటపడింది. మాధవ్ టికేటి అనే టెకీ తన మూడేళ్ల కుమారుడిని చంపి అటవీ ప్రాంతంలో పారేశాడు. ఆ తర్వాత స్థానిక లాడ్జిలో తప్పతాగి పడిపోయాడు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన మధవ్ టికేటి, స్వరూప దంపతులు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే, భార్యకు వివాహేతర సంబంధం ఉందని మాధన్ గతకొంతకాలంగా అనుమానిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం దంపతుల మధ్య గొడవ జరిగింది. అనుమానంతో కోపంగా మాధవ్ తన కుమారుడ్ని తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయాడు. అయితే, అర్ధరాత్రి అయినా భర్త, కుమారుడు ఇంటికి రాకపోవడంతో స్వరూప ఆందోళన చెందింది. అర్ధరాత్రి చందన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను స్కాన్ చేయగా కీలకమైన వివరాలు బయటపడ్డాయి. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు మాధవ్ తన కొడుకుతో కలిసి కనిపించాడు. కానీ సాయంత్రం 5 గంటల ఫుటేజ్ లో అతను ఒంటరిగా బట్టలు కొంటున్నట్లు కనిపించింది. దీంతో, మాధవ్ మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడ్ని ఒక లాడ్జిలో గుర్తించారు. పోలీసులు చేరుకునే సరికి అతడు తప్పతాగి పడిపోయారు. స్పృహలోకి వచ్చాక తన కుమారుడ్ని హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. సమీపంలోని అటవీప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. చిన్నారి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.

Tags:    

Similar News