ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక ఆదేశాలు.. సీఎం కేజ్రీవాల్ హర్షం

ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది.

Update: 2023-02-17 12:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటు హక్కు లేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు విషయంలో ఆమ్ ఆద్మీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆప్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై 24 గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నిక నిర్వహించాల్సిన తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని సూచించింది. సుప్రీం తీర్పుపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News