బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. దేశ వ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌(Bulldozer action)పై స్టే విధించింది.

Update: 2024-09-17 09:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. దేశ వ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌(Bulldozer action)పై స్టే విధించింది. వచ్చే అక్టోబర్ 1వ తేదీ వరకు బుల్డోజర్ యాక్షన్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. రైల్వే లైన్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు, చెరువులను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పలు రాష్ట్రాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను చట్టవిరుద్ధంగా కూల్చివేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టి స్టే విధించింది. కూల్చివేత ఒక్కసారి జరిగినా.. వందసార్లు జరిగినా అది రాజ్యాంగ ధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది.


Similar News