Nirmala Sitharaman: పెరిగిన దిగుమతుల వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

దిగుమతలు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అన్నారు.

Update: 2024-10-26 10:16 GMT

దిశ, బిజినెస్: దిగుమతలు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె.. మీడియాతో మాట్లాడారు. భారత్‌ ప్రపంచదేశాల నుంచి పెద్దమొత్తంలో దిగుమతులు చేసుకోవడం వల్ల దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో సంప్రదాయ ఉత్పత్తుల్లో పెరుగుద లేదని.. అందుకే ఎగుమతులు అధికంగా కావట్లేదన్నారు. అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్న భారత్.. వృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేవారికి వాణిజ్య నిబంధనలు మరింత సరళీకరించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు ఉంటాయన్నారు. పెట్టుబడిదారుల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై..

ప్రపంచ దేశాలు, బహుపాక్షిక ఆర్థికసంస్థల మధ్య సమన్వయం పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. త్వరలోనే ప్రపంచ ఆర్థికవ్యవస్థకు (global economy) మంచి రోజులు రానున్నాయని నిర్మలా పేర్కొన్నారు. ‘‘ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచబ్యాంకు సంయుక్తంగా నిర్వహించిన చర్చలతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ గాడిన పడే ఛాన్స్ ఉన్నట్లు ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. ఫండ్, కేంద్ర బ్యాంకులు, వివిధ సంస్థలు, ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. దీంతో, ప్రపంచ ఆర్థికవ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవ్యవస్థల్లోనూ వృద్ధి శాతం పెరుగుతోంది. అయితే ఈ విషయంలో దేశాలన్నీ జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఆర్థికవ్యవస్థలు స్థిరంగా ఉన్నా.. వెంటనే పుంజుకునేలా లేవు’’ అని నిర్మలా అన్నారు. కరోనా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని నిర్మలా అన్నారు. కరోనా సమయంలో ప్రపంచదేశాలు అధికంగా రుణాలు తీసుకోవడం వల్ల ద్రవ్యలోటుపై నియంత్రణ కోల్పోయాయని పేర్కొన్నారు. అందుకు సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


Similar News