Students Protest: యూపీలో ఉద్రిక్తత.. యూపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు

పీసీఎస్) ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వరుసగా నాలుగో రోజూ నిరసన తెలిపారు.

Update: 2024-11-14 09:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌(Prayagraj)లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ (Pcs) రిక్రూట్‌మెంట్, రివ్యూ ఆఫీస్(RO), అసిస్టెంట్ రివ్యూ ఆఫీస్ (ARO) ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వరుసగా నాలుగో రోజూ నిరసన తెలిపారు. ప్రయాగ్ రాజ్‌లోని ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) కార్యాలయం ఎదుట భారీగా ఆందోళన చేపట్టారు. పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్స్ వేర్వేరు తేదీల్లో ఉంటే పేపర్ లీక్ జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కమిషన్ ఆఫీసుకు వెళ్లే రహదారిపై పోలీసులు బ్యారీ కేడ్లు ఏర్పాటు చేయగా కొంత మంది వాటిని దాటి లోపలికి వెళ్లి నినాదాలు చేశారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.

కాగా, పీసీఏస్ ప్రిలిమినరీ పరీక్షను వచ్చే నెల 7, 8 తేదీల్లో, ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలను డిసెంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్టు యూపీపీఎస్సీ ప్రకటించింది. అయితే పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నాలుగు రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నారు. అయితే విద్యార్థుల డిమాండ్లను యూపీపీఎస్సీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. విద్యార్థులను సీఎం యోగీ ఆధిత్యనాథ్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్టూడెంట్స్ హాస్టళ్లపైనా బుల్డోజర్లు ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. వెంటనే నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు.

Tags:    

Similar News