మాపై హిందీని రుద్దడం ఆపండి : డీఎంకే ఎంపీ కనిమొళి

దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2023-08-09 12:20 GMT

న్యూఢిల్లీ : దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోడీకి తమిళనాడు చరిత్ర సరిగ్గా తెలియదని.. అందువల్లే పార్లమెంటులో "సెంగోల్" రాజదండాన్ని ఏర్పాటు చేయించారని కామెంట్ చేశారు. "చోళ సంప్రదాయానికి చెందినదని చెబుతూ సెంగోల్‌ రాజదండాన్ని కొత్త పార్లమెంట్‌‌లో ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీకి తమిళనాడు చరిత్ర సరిగ్గా తెలియదు. మీరు పాండియన్ సెంగోల్ గురించి విన్నారా? ఒక రాజు పాలనలో విఫలమైనప్పుడే పాండియన్ సెంగోల్ కాలిపోయి ధ్వంసమైంది" అని కనిమొళి చెప్పారు.

"దయచేసి మాపై హిందీని రుద్దడం మానేసి.. సిలప్పటికరం (మొదటి తమిళ ఇతిహాసం) చదవండి.. మీ అందరికీ నేర్పడానికి అందులో చాలా పాఠాలు ఉన్నాయి" అని సూచించారు. "ఇటీవల నేను కూడా మణిపూర్‌లో పర్యటించాను. అక్కడ వందలాది సహాయక శిబిరాలు ఉన్నాయి. కానీ వాటిలో తలదాచుకుంటున్న వారికి తినడానికి తిండి లేదు" అని ఆమె పేర్కొన్నారు.


Similar News