వందేభారత్ రైలుపై మళ్లీ రాళ్ల దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌తో నిందితుల గుర్తింపు
తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలుపై మరోసారి దాడి జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలుపై మరోసారి దాడి జరిగింది. శుక్రవారం సికింద్రాబాద్‌లో బయలుదేరిన వందే భారత్ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని ఈ దాడిలో చైర్ కార్ కోచ్ సి12 భోగి అద్దాల దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
అత్యవసరంగా అద్దం మార్చాల్సి రావటంతో శనివారం ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన 20833 రైలు 3 గంటలు ఆలస్యంగా 8:52 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులని ట్రైన్ రెక్‌కు ఉన్న సీసీకెమెరా ద్వారా గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు.