‘నీట్’ అనవసరమని కేంద్రం అంగీకరించింది: సీఎం స్టాలిన్‌

వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ పరీక్ష కటాఫ్‌ను జీరోకు తగ్గించడం ద్వారా ఆ ఎగ్జామ్ అర్ధరహితమని కేంద్ర సర్కారు అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అన్నారు.

Update: 2023-09-21 10:49 GMT

చెన్నై: వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ పరీక్ష కటాఫ్‌ను జీరోకు తగ్గించడం ద్వారా ఆ ఎగ్జామ్ అర్ధరహితమని కేంద్ర సర్కారు అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అన్నారు. ‘‘నీట్‌కు ఎలాంటి విలువ లేదు. దానివల్ల కలిగే ప్రయోజనం సున్నా అని కేంద్రం కూడా అంగీకరించింది. అందుకే నీట్ పీజీ కటాఫ్‌ను జీరోకు తగ్గించింది’’ అని ఆయన కామెంట్ చేశారు. నీట్‌ వల్ల కేవలం కోచింగ్ సెంటర్లు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని విమర్శించారు. నీట్‌కు మెరిట్‌తో సంబంధం లేదని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని గుర్తు చేశారు.


Similar News