Delhi CM Atishi: సీఎం వర్క్ ఫ్రమ్ హోం.. వీడియో వైరల్

ఢిల్లీ సీఎం అతిషి కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Update: 2024-10-10 09:01 GMT
Delhi CM Atishi: సీఎం వర్క్ ఫ్రమ్ హోం.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ సీఎం అతిషి(Delhi CM Atishi)కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ సీఎం కేజ్రీవాల్(Former CM Kejriwal) జైలు నుంచి విడుదలైన కొద్దిరోజులకు సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే ఈ సమయంలో ఆ ఇంటి తాళాలు తీసుకున్న ముఖ్యమంత్రి అతిషి అదే నివాసంలోకి ప్రవేశించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాగా రూల్స్ ప్రకారం కేజ్రీవాల్ ఖాళీ చేసిన తర్వాత సీఎం నివాసాన్ని PWD డిపార్ట్మెంట్ కు అప్పగించాలి. అలా చేయకుండా డైరెక్ట్ గా వెళ్లడంతో ఆగ్రహించిన PWD అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో సీఎం అతిషి ఆ నివాసాన్ని ఖాళీ చేయగా.. PWD డిపార్ట్మెంట్ సీఎం అధికారిక నివాసానికి సీల్ వేశారు. దీంతో సామానుతో తన ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి అతిషి.. వర్క్ ఫ్రమ్ హోం చేశారు. తన నివాసంలో పలు ఫైళ్లను తనిఖీ చేసి.. అధికారులను సైతం తన ఇంటికే తీసుకొచ్చారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో సీఎం అతిషి పలు ఫైళ్లను పరిశీలించడం కనిపించింది.

Tags:    

Similar News