అమ్మోరుకు నైవేద్యంగా నాలుక కోసిచ్చాడు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అమ్మవారి భక్తులు పరమ నిష్టతో చేస్తుంటారు. అమ్మవారి దీక్షా మాల ధరించి దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు.
దిశ, వెబ్ డెస్క్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అమ్మవారి భక్తులు పరమ నిష్టతో ఆచరిస్తుంటారు. అమ్మవారి దీక్షా మాల ధరించి దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. ఈ క్రమంలో అమ్మవారి పట్ల తమ భక్తిని భక్తులు తమ శక్తిమేర, తోచిన రీతిలో చాటుకుంటుంటారు. అయితే భక్తి పరాకాష్ట స్థాయిలో ఓ భక్తుడు తన నాలుకనే కోసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా లాహర్‌నగర్‌లో రతన్‌గఢ్ దేవీ ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రులలో జరిగిన ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు అవాక్కయ్యారు. పూజారి జైకిషన్ కథనం మేరకు రామ్‌శరణ్ అనే భక్తుడు మూడు అంగుళాల వరకు తన నాలుకను కోసి అమ్మవారి దగ్గర పెట్టాడు. అంతేకాకుండా అక్కడున్న ఒక పాత్రను రక్తంతో నింపాడు. ఇది చూసినవారంతా వారంతా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత రామ్‌శరణ్ కాసేపు ఆలయంలో పడుకుని వెళ్లిపోయినట్టు పూజారీ తెలిపాడు.
రతన్‌గఢ్ అమ్మవారు ఎంతో మహిమగలదని, కోరిన కోర్కెలు తీరుస్తారన్న నమ్మకంతో ఇలా నాలుకలు కోసుకుని అమ్మవారికి సమర్పించిన ఘటనలు ఎన్నో ఉన్నాయట. తిరిగి ఎప్పటికైనా అమ్మవారు నాలుక తెప్పిస్తారని భక్తుల విశ్వాసమని, అదే భక్తి, నమ్మకంతో రామ్ శరణ్ కూడా నాలుక సమ సమర్పించాడని వెల్లడించాడు.