SS Sivasankar: రాముని ఉనికిపై ఎటువంటి చారిత్రక ఆధారం లేదు..డీఎంకే నేత శివశంకర్
తమిళనాడు రాష్ట్ర మంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నేత ఎస్ఎస్ శివశంకర్ శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముని ఉనికి గురించి తెలిపే ఎటువంటి చారిత్రక ఆధారం లేదని వ్యాఖ్యానించారు.
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాష్ట్ర మంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నేత ఎస్ఎస్ శివశంకర్ శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముని ఉనికి గురించి తెలిపే ఎటువంటి చారిత్రక ఆధారం లేదని వ్యాఖ్యానించారు. తాజాగా అరియలూర్‌లో చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడి జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘దేశాన్ని గర్వపడేలా చేసిన గొప్ప పాలకుడు రాజేంద్ర చోళుడి పుట్టినరోజును మనం తప్పక జరుపుకోవాలి. రాజేంద్ర చోళుడు జీవించి ఉన్నాడని చూపించడానికి ఆయన నిర్మించిన చెరువులు, దేవాలయాలు, అతని పేరు స్క్రిప్ట్‌లు, శిల్పాలు, ర కళాఖండాలుఉన్నాయి. దీనికి చరిత్ర, అందుకు తగిన ఆధారాలున్నాయి. కానీ రాముడు ఉన్నాడని చెప్పడానికి ఒక్క ఆధారం, ఎలాంటి చారిత్రక రికార్డులు కూడా లేవు’ అని తెలిపారు.
బీజేపీ నేతలు రాముడి ఉనికికి సంబంధించిన రికార్డులను అవతార్ అని పిలుస్తుంటారని విమర్శించారు. చరిత్రను తారుమారు చేయడానికి మరొక చరిత్రను ఎంతో పెద్దదిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. శివశంకర్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. శ్రీరాముడిపై డీఎంకేకు ఉన్న ఆకస్మిక అభిమానం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. డీఎంకే నాయకుల జ్ఞాపకాలు ఇంత త్వరగా మసకబారుతాయని ఎవరూ ఊహించలేదని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనంలో చోళ రాజవంశం సెంగోల్ రాజదండం ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఆ రాజుల గురించే మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.