King Charles III: మరోసారి ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్
బ్రిటన్ రాజు చార్లెస్ III(75) (King Charles III) అనారోగ్య సమస్యలతో సతమతమతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: బ్రిటన్ రాజు చార్లెస్ III(75) (King Charles III) అనారోగ్య సమస్యలతో సతమతమతున్న సంగతి తెలిసిందే. ఆయన గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతూ, చికిత్స సైతం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పలు సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో చార్లెస్ మరోమారు లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. వైద్యుల సూచన మేరకు గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఆయన కార్యక్రమాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. కాగా, 2022సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 (96) మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికయ్యారు.