గూఢచారి పావురం.. హై టెక్నాలజీ స్పై కెమెరా

కెమెరా, మైక్రోచిప్‌తో సహా పరికరాలను అమర్చిన 'గూఢచారి' పావురం ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ తీరంలో ఫిషింగ్ బోట్‌లో పట్టుబడింది.

Update: 2023-03-09 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: కెమెరా, మైక్రోచిప్‌తో సహా పరికరాలను అమర్చిన 'గూఢచారి' పావురం ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ తీరంలో ఫిషింగ్ బోట్‌లో పట్టుబడింది. కాగా ఈ పావురన్ని గూఢచర్యానికి వినియోగించే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే పావురం కాళ్లకు అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహాయం తీసుకుంటామని జగత్‌సింగ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ తెలిపారు.

దీంతో పాటు పక్షి రెక్కల పై గుర్తు తెలియని భాషలో ఏదో రాసినట్లు ఉందని.. ఏం రాశారో తెలుసుకోవడానికి నిపుణుల సహాయం కూడా తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఫిషింగ్ ట్రైలర్ 'సారథి' ఉద్యోగి పీతాంబర్ బెహెరా మాట్లాడుతూ, పడవపై పావురాన్ని తాను చూశానని చెప్పారు. "అకస్మాత్తుగా పక్షి కాళ్లకు కొన్ని వింతైన పరికరాలు కనిపించాయి, పక్షి రెక్కలపై ఏదో రాసి ఉన్నట్లు కూడా నేను గుర్తించానని పక్షిని పట్టుకుని వ్యక్తి అన్నారు. కాగా దీనిని 10 రోజుల క్రితం కోణార్క్ తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో లంగరు వేయగా ట్రాలర్‌లో పావురం కనిపించింది. గత కొన్ని రోజులుగా పక్షికి విరిగిన అన్నం తినిపించినట్లు బెహెరా తెలిపారు.

Tags:    

Similar News