అప్పుల కోసం తిప్పలు.. రూ.3,200 కోట్లు సేకరించనున్న స్పైస్ జెట్!

గ్రౌండ్ అయిన విమానాలను తిరిగి సర్వీసులోకి తెచ్చేందుకు.. స్పైస్ జెట్ సంస్థ ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్(qualified institutional placement), వారెంట్స్ రూపంలో రూ. 3,200 కోట్లు సేకరించాలని ప్రణాళికలు చేస్తోంది.

Update: 2024-09-07 04:40 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్రౌండ్ అయిన విమానాలను తిరిగి సర్వీసులోకి తెచ్చేందుకు.. స్పైస్ జెట్ సంస్థ ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్(qualified institutional placement), వారెంట్స్ రూపంలో రూ. 3,200 కోట్లు సేకరించాలని ప్రణాళికలు చేస్తోంది. అయితే అప్పులను తీర్చడానికి గానూ, ఇప్పటికే గ్రౌండ్ అయిన విమానాలను కూడా తిరిగి సర్వీసులోకి తెచ్చేందుకు ఈ ఫండ్స్ ను సేకరించి, వాటికోసం వాడనున్నట్లు సంస్థ తెలిపింది. అయితే, స్పైస్ జెట్ ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్ లో.. రూ.736 కోట్లను ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా, వారెంట్స్ ను ఇష్యూ చేయడం ద్వారా సేకరించాలని; మరో రూ.2,500 కోట్లను క్యూఐపీ ద్వారా సేకరించాలని ప్రణాళికలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

అయితే, గతేడాదే డిసెంబర్ నెలలో రూ. 2,250 కోట్లు సేకరిస్తామని కంపెనీ తెలిపినా.. కేవలం రూ.1,060 కోట్లను మాత్రమే ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా సేకరించగలిగింది. ప్రస్తుత రూ.3,200 కోట్ల ఫండ్స్ సేకరణ మాత్రం షేర్ హోల్డర్ల అనుమతులపై ఆధారపడి ఉంది. కాగా తమ సంస్థలో విమానాలు తగ్గడం, వర్కింగ్ క్యాపిటల్ ఖర్చులు పెరగడం, ఎయిర్ పోర్టుల వద్ద ఫిక్స్డ్ రెంటల్స్ ఉండటం, బకాయిలు లాంటి పలు సమస్యలను సంస్థ ఎదుర్కొంటోంది. దీంతో 2019 లో సర్వీసులో ఉన్న సంస్థ విమానాలు 74 ఉంటే.. ఈ ఏడాదికి వచ్చేసరికి 28 కి పడిపోయినట్లు సంస్థ పేర్కొంది.


Similar News