18వ లోక్ సభ తొలి సమావేశాల్లో 103 శాతం ఉత్పాదకత

18వ లోక్‌సభ తొలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూన్ 24న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో ప్రారంభమై జూలై 2న ప్రధాని మోడీ సమాధానంతో ముగిసింది.

Update: 2024-07-03 08:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూన్ 24న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో ప్రారంభమై జూలై 2న ప్రధాని మోడీ సమాధానంతో ముగిసింది. దీనిపై లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటు తొలి సెషన్ లో 103 శాతం ఉత్పాదకత సాధించినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మొత్తం 7 రోజుల్లో 34 గంటల పాటు చర్చలు జరిగాయని అన్నారు. జాన్ 27న రాష్ట్రపతి ప్రసంగంపై 18 గంటల పాటు చర్చ జరిగిందన్నారు. ఆ సంవాదంలో 60 మంది పాల్గొన్నారని..50 మంది సభ్యులు మాట్లాడరని లోక్ సభ స్పీకర్ తెలిపారు. కాగా.. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం దాకా జరగాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేశారు.

నీట్ వివాదంపై దద్దరిల్లిన పార్లమెంటు

తొలి రెండు రోజుల్లో పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 539 మంది సభ్యులు ప్రమాణంచేశారు. నీట్ పరీక్ష వ్యవహారంలో పార్లమెంటు దద్దరిల్లిపోయింది. పేపర్ లీక్‌లు, అగ్నిపథ్ పథకం, మణిపూర్ వంటి అంశాలతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ మైనారిటీల పట్ల హింస, ద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేస్తున్నాయని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతలు ‘అసలు హిందువులు’ కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డు నుంచి తొలగించారు.


Similar News