Census Of India: జనగణనలో 31 ప్రశ్నలు.. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నదా?

జనగణనకు 31 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారని తెలిసింది. కుటుంబంలో ఉండే సభ్యులు సంఖ్య, ఇంటి పెద్ద మహిళనా? పురుషుడా? ఒకే కుటుంబంలో కలిసి నివసిస్తున్న దంపతులు ఎంత మంది వంటి వివరాలను సేకరించనుంది.

Update: 2024-10-28 20:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాదిలో జనగణన(Census) ప్రారంభించి 2026లో పూర్తి చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. జనగణనకు 31 ప్రశ్నల(questionnaire)తో వివరాలు సేకరించనున్నారని తెలిసింది. కుటుంబం(Household)లో ఉండే సభ్యులు సంఖ్య, ఇంటి పెద్ద మహిళనా? పురుషుడా? ఒకే కుటుంబంలో కలిసి నివసిస్తున్న దంపతులు ఎంత మంది వంటి వివరాలను సేకరించనుంది.

అలాగే.. ఎన్ని కుటుంబాలు టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్, సైకిలు, స్కూటర్ లేదా మోటార్ సైకిల్‌లు కలిగి ఉన్నది అడగనుంది. కార్, జీపు లేదా వ్యాన్ కలిగి ఉన్నదా? అనే ప్రశ్ననూ వేయనుంది. కుటుంబం ఎక్కువ ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటుందని, తాగు నీటికి ఎలాంటి వనరుపై ఆధారపడుతుంది? విద్యుత్ ఎలా పొందుతుంది? లెట్రిన్ సౌకర్యం ఉన్నదా? ఎలాంటి లేట్రిన్ ఉన్నది? మురికి నీరు ఎలా బయటికి పంపిస్తున్నది? స్నానానికి ప్రత్యేక గది ఉన్నదా? కిచెన్ ఉన్నదా? ఎల్పీజీ లేదా పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నదా? వంటకు ప్రధాన వంటచెరుకుగా దేన్ని ఉపయోగిస్తున్నది? రేడియో, ట్రాన్సిస్టర్ లేదా టీవీ వంటివి అందుబాటులో ఉన్నాయా? వంటి వివరాలను జనగణనలో భాగంగా ప్రజలను అడగనున్నారు.

Tags:    

Similar News