Sidhu Moose Wala: మూసేవాలా హత్య కేసు.. మరో నిందితుడు భారత్‌కు..

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సచిన్‌ బిష్ణోయ్‌‌ను అజర్‌బైజాన్‌ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.

Update: 2023-08-01 10:41 GMT

న్యూఢిల్లీ : పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సచిన్‌ బిష్ణోయ్‌‌ను అజర్‌బైజాన్‌ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అధికారులు అతడిని మంగళవారం మన దేశానికి పట్టుకొని వచ్చారు. ఈవిషయాన్ని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించారు. గతేడాది మే 29న సిద్ధూ మూసేవాలా తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాల్లోని తన ఊరికి వెళ్తుండగా కొందరు అడ్డగించి కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధూ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి హత్య వెనుక గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారిలో ఇద్దరు గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మరో ఇద్దరు జైలులో జరిగిన ఘర్షణలో మరణించారు. హత్యతో సంబంధమున్న సచిన్‌ బిష్ణోయ్‌ని తాజాగా ఢిల్లీ పోలీస్‌ ప్రత్యేక సెల్‌ భారత్‌కు తీసుకొచ్చింది.


Similar News