శబరిమల ఆలయ ప్రాంగణంలో షాకింగ్ ఘటన.. అయ్యప్పస్వామి ఆత్మహత్య

కార్తికమాసం పూర్తవడంతో అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు మాల విరమణ కోసం కేరళలోని శబరిమలకు క్యూ కడుతున్నారు.

Update: 2024-12-17 02:36 GMT

దిశ, వెబ్ డెస్క్: కార్తికమాసం పూర్తవడంతో అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు మాల విరమణ కోసం కేరళలోని శబరిమల(Sabarimala)కు క్యూ కడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంతో.. పంబా తీరము మొత్తం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతుంది. ఇదిలా ఉంటే.. శబరిమల ఆలయ ప్రాంగణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అయ్యప్ప స్వామి మంగళవారం తెల్లవారుజామున శబరిమలలోని నెయ్యాభిషేక కౌంటర్ల మండపం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య(Ayyappa Swamy committed suicide) చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలు.. భక్తుడు బిగ్గరగా అరుస్తూ.. నెయ్యాభిషేక కౌంటర్ మండపం పై నుంచి కిందకు దూకడం స్పష్టంగా కనిపించింది. కాగా తీవ్ర గాయాలైన ఆ భక్తుడుని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి మార్గ మధ్యంలోనే మృతి చెందాడని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా మృతుడు కర్ణాటకలోని రామనగరగా గుర్తించారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న భక్తుని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలుపుతున్నారు.


Similar News