Jamili Bill: ‘జమిలి‘ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన అర్జన్ రామ్ మేఘవాల్.. విపక్షాల ఆందోళన షురూ
దేశ ప్రజలతో పాటు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆసక్తిగా ఎంతో ఎదరుచూస్తున్న ‘జమిలి’ ఎన్నికల బిల్లు (Jamili Election Bill) పార్లమెంట్ (Parliament)లోకి రానే వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలతో పాటు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆసక్తిగా ఎంతో ఎదరుచూస్తున్న ‘జమిలి’ ఎన్నికల బిల్లు (Jamili Election Bill) పార్లమెంట్ (Parliament)లోకి రానే వచ్చింది. ఈ మేరకు ఇవాళ సభలో 129వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ (One Nation.. One Election) బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ (Union Minister Arjun Ram Meghawal) ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో సభలో బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) అధికారికంగా అనుతిచ్చారు. ఓ వైపు బిల్లుపై అధికార పార్టీ నేతలు మాట్లాడుతుండగానే.. జమిలి ఎన్నికల బిల్లు (Jamili Election Bill)ను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ Congress), ఇతర విపక్షాలు సభలో నిరసనకు దిగాయి.
మరోవైపు రాష్ట్రాల అసెంబ్లీ కాల వ్యవధిని కుదించేందుకు వీలు లేదంటూ కాంగ్రెస్ (Congress) ఎంపీ మనీష్ తివారీ (MP Manish Tiwari) అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఈ బిల్లు పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు. అంబేద్కర్ విజన్‌కు జమిలి ఎన్నికల బిల్లు వ్యతిరేకమని సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ (MP Dharmendra Yadav) అన్నారు. అదేవిధంగా జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను హరించడమేనని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు వస్తాయని తెలిపారు. ఇది ఎన్నికల సంస్కరణ కాదని.. ఓ వ్యక్తి కల మాత్రమేనని, జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ (MP Kalyan Benerji) అన్నారు. మూడింట రెండొంతుల మేజారిటీ లేనప్పుడు బిల్లును సభలో ఎలా ప్రవేశపెడతారని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు (MP TR Balu) అన్నారు.
కాగా, ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జేడీయూ, షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్‌సీపీ, జనసేన, జేడీఎస్, లోక్‌జన్ శక్తి, రాష్ట్రీయ లోక్‌దళ్, పట్టల్ మక్కల్ కట్చి, ఏజీపీ, ఆప్నాదల్ (సోనేవాల్) నేషనల్ పీపుల్స్ పార్టీలు ‘జమిలి’ ఎన్నికల బిల్లుకు జై కొట్టాయి. ఇక కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక వేళ రాజ్యసభ, లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందితే.. పార్లమెంట్, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.