Manipur CM: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ నివాసం దగ్గర బాంబు..!

ఈశాన్యరాష్ట్రం మణిపూర్ (Manipur)లో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. మైతేయ్‌-కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఏడాదిన్నరగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2024-12-17 07:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్యరాష్ట్రం మణిపూర్ (Manipur)లో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. మైతేయ్‌-కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఏడాదిన్నరగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. ప్రస్తుతం ముఖ్యమంత్రి (Bomb At Manipur CM Residence) నివాసం వద్దే బాంబు కన్పించడం తీవ్ర కలకలం రేపింది. మణిపుర్‌లోని కొయిరెంగేయ్‌ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (Manipur CM Biren Singh) నివాసం ఉంది. కాగా.. ఆ నివాసానికి కొన్నిమీటర్ల దూరంలోనే మోర్టార్ బాంబుని గుర్తించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. అయితే, బాంబు ఉన్న సమయంలో సీఎం బీరెన్ సింగ్ తన నివాసంలో లేరని తెలుస్తోంది. ఈ రాకెట్‌ ప్రొపెల్డ్‌ బాంబును సోమవారం రాత్రి పెట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో, సీఎం ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు వాడి ఉంటారు? అన్న కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News