One Nation-One Election Bill : వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్

వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లు(One Nation-One Election Bill)పై లోక్ సభ(Lok Sabha)లో ఓటింగ్(Voting)కొనసాగుతోంది.

Update: 2024-12-17 08:18 GMT

దిశ, వెడ్ డెస్క్ : వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లు(One Nation-One Election Bill)పై లోక్ సభ(Lok Sabha)లో ఓటింగ్(Voting)నిర్వహించారు. తొలిసారిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. సాంకేతిక సమస్యలున్న చోట, అలాగే అడిగిన సభ్యులకు స్లిప్పులను అందించి జేపీసీ అంశంపై ఓటింగ్ కొనసాగించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్ ప్రవేశ పెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు ఎన్డీఏ పక్షాలు మద్ధతు తెలిపాయి. విపక్షాలు వ్యతిరేకించాయి.

అనుకూలంగా 269 ఓట్లు వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. బిల్లుపై చర్చలో జేపీసీకీ అభ్యంతరం లేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జేపీసీకి పంపాలన్న విషయంపై డివిజన్ కు స్పీకర్ అనుమతించడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా సభ్యుల ఓటు వేశారు.

Tags:    

Similar News