హేమంత్ సొరేన్‌కు షాక్.. బెయిల్‌పై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఈడీ

ఇటీవలే జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సొరేన్‌కు షాక్ తగిలింది. భూ కుంభకోణం కేసులో భాగంగా ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

Update: 2024-07-08 17:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవలే జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సొరేన్‌కు షాక్ తగిలింది. భూ కుంభకోణం కేసులో భాగంగా ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సొరేన్‌కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ తప్పుపట్టినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, న్యాయస్థానం పక్షపాతంతో వ్యవహరించిందని పేర్కొన్నట్టు సమాచారం. కాగా, మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరి 31న ఈడీ సొరేన్‌ను అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన బిర్సా ముండా జైలులో ఉండగా..జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత నెల 28న ఆయన బయటకు వచ్చారు. అనంతరం చంపై సొరేన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఈ నెల 4వ తేదీన హేమంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు షాక్ తగిలినట్టు అయింది. ఈ పిటిషన్ తర్వలోనే విచారణకు రానున్నట్టు తెలుస్తోంది. అయితే, ఒకవేళ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే జార్ఖండ్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠగా మారుతాయి. 


Similar News