హర్యానాలో కాంగ్రెస్‌కు షాక్..బీజేపీలో చేరిన కిరణ్ చౌదరి, శృతి చౌదరి

అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే కిరణ్ చౌదరి, ఆమె కుమార్తె శృతి చౌదరితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు.

Update: 2024-06-19 06:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే కిరణ్ చౌదరి, ఆమె కుమార్తె శృతి చౌదరితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని కాషాయ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సీఎం నాయబ్ సింగ్ సైనీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ చౌదరి మాట్లాడుతూ..దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది బీజేపీ విధానాలేనని స్పష్టం చేశారు. అందుకుకే మళ్లీ మళ్లీ ప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకున్నారని తెలిపారు. బీజేపీకి ఆదరణ ఎలా పెరుగుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని, రోజురోజుకూ బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మోడీతోనే అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమవుతుందన్నారు. కాగా, కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధానికి కిరణ్ స్వస్తి పలికడం గమనార్హం. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు షాక్ తగలగా బీజేపీకి ఊపుతెచ్చినట్టైంది.


Similar News