Shivraj Singh: హేమంత్‌ సోరెన్‌ భయపడుతున్నారు.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. హేమంత్ భయపడుతున్నారని..

Update: 2024-08-29 19:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. హేమంత్ భయపడుతున్నారని.. అందుకే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యేలు, కూటమికి చెందిన మంత్రులందరిపై నిఘా పెట్టారని ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు చంపై సోరెన్ ఎంతో కృష్టి చేశారని కొనియాడారు. అయినప్పటికీ ఆయనను ఎంతో అవమానించారని, వేదనకు గురి చేశారని తెలిపారు.

బంగ్లాదేశ్ చొరబాటు దారులు గిరిజన భూములను ఆక్రమిస్తున్నారని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని ఫైర్ అయ్యారు. జేఎంఎం ప్రభుత్వాన్ని బీజేపీ త్వరలోనే కూల్చివేస్తుందని దీమా వ్యక్తం చేశారు. అంతకుముందు న్యూఢిల్లీలో ‘ఏక్ పెద్ మా కే నామ్’ ప్రచారం కింద శివరాజ్ సింగ్ ఒక మొక్కను నాటారు. రాబోయే తరాలకు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.


Similar News