సమాజ్‌వాదీగా.. అఖిలేష్‌కు బాబాయిగా మిగిలిపోతా : శివపాల్
దిశ, నేషనల్ బ్యూరో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బాబాయి శివపాల్ యాదవ్ మధ్య గ్యాప్ పెరిగిందంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
దిశ, నేషనల్ బ్యూరో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బాబాయి శివపాల్ యాదవ్ మధ్య గ్యాప్ పెరిగిందంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బాబాయి శివపాల్‌ను అఖిలేష్ గౌరవించడం లేదంటూ యోగి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా శనివారం శివపాల్ యాదవ్ స్పందించారు. తన గురించి మితిమీరిన ఆందోళనను ఆపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సూచించారు. తాను కరుడుగట్టిన సమాజ్‌వాదీ(సోషలిస్ట్) అని.. ఎప్పటికీ అఖిలేష్‌కు బాబాయిగానే మిగిలిపోతానని శివపాల్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వేదికగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. బీసీలు, దళితులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే సమాజ్ వాదీ పార్టీలోనే జీవితాంతం ఉంటానని తేల్చి చెప్పారు. ‘‘సీఎం యోగి అనవసరంగా నా గురించి ఆందోళన చెందుతున్నారు.ఆయనగారు చాచా పే చర్చా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది’’ అని శివపాల్ సింగ్ సెటైర్స్ వేశారు. ఈ కామెంట్స్ చేసిన టైంలో సభలో సీఎం యోగి లేరు. ప్రతిపక్ష నేత అఖిలేష్ అక్కడే కూర్చొని.. బాబాయి మాటలు విని చిరునవ్వులు చిందించారు.