‘ఢిల్లీ డిక్లరేషన్’ పై ఏకాభిప్రాయం భారత్‌కు గర్వకారణం : Shashi Tharoor

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

Update: 2023-09-10 10:54 GMT

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఢిల్లీ డిక్లరేషన్’ పై జీ20 సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో భారత్‌ విజయం సాధించిందన్నారు. ఈ పరిణామం భారత్‌కు ఎంతో గర్వకారణమన్న ఆయన.. మన దేశం తరఫున షెర్పాగా వ్యవహరించిన అమితాబ్‌ కాంత్‌ పాత్రను కొనియాడారు. ఢిల్లీ డిక్లరేషన్ పై జీ20 దేశాల మధ్య ఏకాభిప్రాయం ఎలా కుదిరిందనే విషయాన్ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్‌ కాంత్‌ వివరించారు. ఆ ఇంటర్వ్యూ వీడియోను ట్విట్టర్ లో ట్యాగ్ చేసిన శశి థరూర్.. ‘‘అమితాబ్‌ కాంత్‌ బాగా పనిచేశారు. మీరు ఐఏఎస్‌ ఎంచుకున్నప్పుడు.. ఐఎఫ్‌ఎస్‌ దూకుడైన దౌత్యవేత్తను కోల్పోయింది. ఢిల్లీ డిక్లరేషన్ పై రష్యా, చైనాలను మెప్పించి ఒప్పించడం భారత్‌కు గర్వకారణం’’ అని కామెంట్ చేశారు.


Similar News