దేశంలో 86.5 శాతం నోట్లు 500 రూపాయలవే
దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది మే నెలలో రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకున్నాక రూ.500 నోట్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది.
దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది మే నెలలో రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకున్నాక రూ.500 నోట్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. 2024 మార్చి నాటికి దేశంలో చలామణీలో ఉన్న మొత్తం నగదులో 86.5 శాతం రూ.500 నోట్లే ఉన్నాయని తాజాగా వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో 5.16 లక్షల రూ.500 నోట్లు చలామణీలో ఉన్నాయని తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023 మార్చి నాటికి)లో రూ.500 నోట్ల వినియోగం 77.1 శాతంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తమ వార్షిక నివేదికలో పేర్కొంది. ఇక దేశంలో 2.49 లక్షల పది రూపాయల నోట్లు చలామణీలో ఉన్నాయని చెప్పింది. మార్చితో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.27,031 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లను కొన్నామని ఆర్‌బీఐ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం.