Sharad Pawar: శరద్ పవార్ యూటర్న్.. అలా అనలేదని మాట మార్చిన ఎన్సీపీ చీఫ్..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ ఎన్సీపీ నాయకుడిగా‌‌ కొనసాగుతున్నట్లు చేసిన ప్రకటనపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ యూటర్న్ తీసుకున్నారు.

Update: 2023-08-25 13:44 GMT

మహారాష్ట్ర: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ ఎన్సీపీ నాయకుడిగా‌‌ కొనసాగుతున్నట్లు చేసిన ప్రకటనపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ యూటర్న్ తీసుకున్నారు. అతను తమ పార్టీ లీడర్ అని తాను అనలేదన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియ సూలే.. అజిత్ చెల్లెలు కాబట్టి అలా చెప్పవచ్చని మాట మార్చారు. ఇందులో రాజకీయ అర్థాలు వెతకాల్సిన పనిలేదన్నారు. కానీ, అంతకు ముందు ‘అజిత్ పార్టీలో సీనియర్ లీడర్, ఎమ్మెల్యే’ అని సుప్రియ వ్యాఖ్యానించింది. దీనిపై స్పందిస్తూ.. ‘అవును.. ఈ విషయంలో మరో ప్రశ్నకు తావు లేదు’ అని శరద్ పవార్ సమాధానమిచ్చారు.

ఈ ప్రకటన కాస్తా సంచలనం కలిగించగా.. కొన్ని గంటల తర్వాత సతారాలో తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ‘అజిత్ పవార్ తన సోదరుడు అనే ఉద్దేశ్యంలో సుప్రియ అలా చెప్పింది’ అన్నారు. కాగా, శరద్ పవార్‌పై అసంతృప్తితో అజిత్ పవార్ తన వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో అధికారం చేపట్టిన ‘మహా వికాస్ అఘాడి’ కూటమి విచ్ఛిన్నమైంది.


Similar News