కుమార్తె పై తండ్రి అత్యాచారం ఘటనలో కేరళ కోర్టు సంచలన తీర్పు!

17 ఏళ్ల కుమార్తె పై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Update: 2024-06-22 13:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 17 ఏళ్ల కుమార్తె పై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా విదించింది. కేరళలోని అరికోడ్ కి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006 లో జన్మించిన తన కుమార్తెకు పదేళ్లు వచ్చినప్పటినుంచి తండ్రి నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయం బయటకి చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో ఆ బాలిక దారుణాన్ని బయలకు చెప్పలేదు. బాధితురాలు అనారోగ్యానికి గురి కావడంతో తండ్రి ఆసుపత్రి తీసుకెళ్లాడు.

బాలికను పరీక్షించిన వైద్యులు కోజీకొడ్ లోని మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. వైద్యుల సలహా మేరకు మెడికల్ కాలేజీలో ఆ బాలికకు అబార్షన్ చేశారు. ఆ తర్వాత ధైర్యం చేసిన బాలిక తండ్రి చేస్తున్న అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతేగాక నిందుతుడికి బెయిల్ ఇస్తే బాలికకు ప్రమాదం తలపెట్టే అవకావం ఉందని కోరడంతో కోర్టు నిందుడికి బెయిల్ మంజూరు చేయలేదు. దీనిపై విచారణ జరిపిన కేరళ మంజేరీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి పలు సెక్షన్ల కింద 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు జరిమానా చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని బాధితురాలికి ఇవ్వాలని తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం అధికారులు నిందితుడిని తవనూరు సెంట్రల్ జైలుకు తరలించారు.


Similar News