నా పరిస్థితులు నన్ను బలవంతం చేశాయి.. అతడితో సంబంధంపై హైకోర్టులో యువతి వాదన
వయసుతో పని లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటున్నారు. కనీసం మైనార్టీ తీరకముందే రిలేషన్ షిప్‌లోకి వెళ్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : వయసుతో పని లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటున్నారు. కనీసం మైనార్టీ తీరకముందే రిలేషన్ షిప్‌లోకి వెళ్తున్నారు. తాజాగా ఓ యువకుడితో సహజీవనం చేస్తున్న యువతి కేసుపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అయినా పెళ్లి చేసుకోకుండా ఆ యువతి యువకుడితో కలిసి సహజీవనం చేసేందుకు అనుమతి ఇచ్చింది. పిటిషనర్లకు 18 దాటినందుకు వారిద్దరు కలిసి జీవించే హక్కు ఉందని అభిప్రాయపడింది.
మేజర్లయిన యువతీ యువకుడు చేస్తున్న సహజీవనంపై దాఖలైన పిటిషన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు విచారించింది. జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టగా.. బాధిత యువతి “నా పరిస్థితులు నాకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి బలవంతం చేశాయి” అని కోర్టుకు తెలిపింది. ఆమె పరిస్థితులను గౌరవిస్తూ.. వారిద్దరు సహజీవనం చేసుకునేందుకు అర్హులే అని కోర్టు తీర్పునిచ్చింది. పిటిషనర్లిద్దరు 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉన్నాయని కోర్టు వివరించింది. ఇకపై బయటి వారి జోక్యం చేసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. కానీ, కోర్టు యువతి చిన్న వయసులోనే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలని నిర్ణయించుకునే నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్తోమత లేకుండా, పరిణతిలేని దశలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వారి భవిష్యత్తుకు సవాలు ఏర్పరచవచ్చని కోర్టు సూచించింది. భార్యాభర్తల హక్కులను పరిరక్షించాలని, బయటివారి నుండి జోక్యం లేకుండా వారిని సురక్షితంగా ఉంచాలని కోర్టు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.